సీతమ్మలకు రక్షణ లేని దేశంలో.. రామమందిరం కట్టి ఎం లాభం ? - TeluguCircle-Trending News

Breaking

03 October 2020

సీతమ్మలకు రక్షణ లేని దేశంలో.. రామమందిరం కట్టి ఎం లాభం ?




ఉత్తర్ ప్రదేశ్(Utter Pradesh) లో 19  సంవత్సరాల దళిత అమ్మాయిని,  నలుగురు ఉన్నత కులం మగ (మృగాళ్ళు) వారు దారుణంగా అత్యాచారం(Gang Raped) చేసి వదిలేసారు. ఆమె కాళ్ళు నడవలేని పరిస్థితి, మెడకు గాయాలు, వెన్ను ముక్క విరిగిపోయింది. నాలుక కత్తిరించారు. అనేక గాయాలతో పోరాడుతూ సెప్టెంబర్ 29న ఆమె మరణించింది. మరలా  ఆ  మృగాళ్లను కాపాడటం కోసం అక్కడి పోలీసుల(Police) సాయంతో రాత్రికి రాత్రే ఆమెకు దహన సంస్కారాలు  జరిపిన  ఆటవిక ఘటన ఫై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమహుతుంది. యూపీ(UP) తో పాటు అన్ని రాష్ట్రాలలో ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఈ ఘటనలో ఏమి జరగలేదు అని చెప్పేందుకు యోగి సర్కార్(UP CM Yogi Adhitya Nadh) తీవ్రంగా ప్రయత్నిస్తుంది. 


      తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు మరణవాంగ్మూలం ఇచ్చిన అలీఘర్ ఆసుపత్రి పోస్టుమార్టం రిపోర్ట్ లో ఆమెపై అత్యాచారం ఏమి జరగలేదు అని చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. హత్రాస్ లో ఘటన మరువకమునుపే మరో ఇద్దరు బాలికను అత్యాచారం చేసి చంపారు. అయినాగానీ ఆ దుర్మార్గులపై చర్య తీసుకోకుండా అధికార వ్యవస్థలు దుర్మార్గాలను కాపాడంకోసం ఉన్న సాక్షాలను లేకుండా చేయడానికి ప్రయతిస్తున్నారు. రోజురోజుకు ప్రభుత్వాలు  అవినీతి ,అక్రమాలకు లోబడి దుర్మార్గులను రక్షిస్తుంచడానికి రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్నారు.  ఇంకా ఎందరో సీతమ్మ తల్లి లాంటి మహిళలకు రక్షణ కల్పించలేను వారు అక్కడ అయోధ్యలో రామాలయం కడతారు అంటా! ... 

No comments: