
రోజురోజుకు కరోనా(Corona) ఉధృతి పెరుగుతూనే ఉంది. ఎంత జాగ్రత్తలు తీసుకున్న కరోనా వ్యాప్తి పెరుగుతుంది. ఎక్కువగా పబ్లిక్ సెక్టార్ లో చేసే అధికారులు నుండి పెద్ద పదవులలో ఉన్న ప్రముఖుల వరకు .. సామాన్యు ప్రజల నుండి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా బారిన పడుతున్నారు.
ఈరోజే కేంద్ర రైల్వే శాఖా సహాయమంత్రి(Railway Union Minister) సురేష్ అంగడి(Suresh Angadi) కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్(AIMS) లో కరోనా(Corona) చికిత్స పొందుతూ మరణించారు. 12 రోజులుగా కరోనా చికిత్స తీసుకుంటున్నారు. కరోనా సోకింది అని ఈ నెల 11న స్వయంగా ఆయనే ట్వీట్ చేసారు. సురేష్ అంగడి గారిది కర్ణాటక(Karnataka) రాష్ట్రము … బెళగావి నుంచి 4 సార్లు ఎంపీ(MP)గా గెలుపొందారు..
 
;
No comments:
Post a Comment