సన్ రైజర్స్‌ హైదరాబాద్ ఓడిపోవడానికి కారణం అదే - TeluguCircle-Trending News

Breaking

22 September 2020

సన్ రైజర్స్‌ హైదరాబాద్ ఓడిపోవడానికి కారణం అదే




DUBAI IPL T20 : తొలి విజయం కోసం వేట మొదలు పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad) SRH  తమ ప్రారంభ మ్యాచ్ లో ఓడిపోయింది. 164 పరుగుల ఛేదనలో వార్నర్(Warner) ఆరంభంలోనే రనౌట్ అయిన … బెయిర్ స్టో  ధాటిని అద్భుతనంగా ఆటపై ఆశలు రేపాడు. 121/2 తో పటిష్టంగా కనిపిస్తున్న దశలో చాహల్ (Yazuvendra Chahal) కు తోడు  సైనీ పేస్ తో మరో 32 పరుగుల కే మిగిలిన వికెట్లు కోల్పోయింది. దీనికి తోడు ఎప్పటిలాగే మిడిలార్డర్ వైఫల్యం సన్ రైజర్స్ కొంపముంచినది. అంతకుముందు బెంగళూరు బ్యాటింగ్ లో దేవదత్(DevaDath) డివిల్లీర్స్ (DE Villiers) అర్థ సెంచరీ లతో బారి స్కోర్ కు దోహదపడ్డాడు.  

బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(RCB)  ఐపీఎల్‌(IPL T20)  తాజా సీజన్‌లో చక్కటి బోణీ చేసింది. అటు గెలుపు దిశగా సాగుతున్న మ్యాచ్‌లో ఒత్తిడికి లోనైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. జానీ బెయిర్‌స్టో(Jonny Bairstow) (43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61) పోరాటం కనబర్చినా చివర్లో చేతులెత్తేశారు. సోమవారం(Monday) జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు(RCB) 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. దేవదత్‌ పడిక్కళ్‌(Devadatta Padikkal) (42 బంతుల్లో 8 ఫోర్లతో 56), డివిల్లీర్స్‌(De Villers) (30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) అర్ధసెంచరీ సాధించారు. ఆ తర్వాత ఛేదనలో సన్‌రైజర్స్‌(SRH) 19.4 ఓవర్లలో 153 పరుగులు చేసి ఓడింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా చాహల్‌(Man of the match Chahal) (3/18) నిలిచాడు.

More Click Here   :


 IPL T20 Free Match Live SRH vs RCB


No comments: