ప్రఖ్యాత డిజిటల్(Digital) ప్రెమెంట్స్ సంస్థ పే టి ఎం(PAYTM)ను గూగుల్ (Google) సంస్థ ప్లేస్టోర్ నుంచి శుక్రవారం తొలగించింది. పే టి ఎం(PAYTM) తో పాటు ఫస్ట్ గేమ్స్ కూడా తీసేసింది. పేటిఎం బిజినెస్ , పేటిఎం మాల్ (PaytmMall), పేటిఎం మనీ యాప్స్ మాత్రం జనరల్ గానే అందుబాటులో ఉంటాయి.
గ్యాంబ్లింగ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా గూగుల్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఉల్లంఘన సంబంధించి ఇంతకుముందే చాలాసార్లు పేటిఎంకు గూగుల్ సంస్థ నోటీసులు పంపింది. తరచూ గూగుల్ నిబంధనలను ఉల్లంఘించడం వలన ఈ చర్యలు తీసుకుంది. గూగుల్ సంస్థ నిబంధనల ప్రకారం .. ఎటువంటి జూదాలు, ఆన్లైన్ బెట్టింగులు నిర్వహించకూడదు. పేటిఎం(PAYTM), పేటిఎం ఫస్ట్ గేమ్స్ (PAYTM FIRST GAMES )ద్వారా ఫాంటసీ క్రికెట్ సేవలను మొదలుపెట్టింది.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించడంపై పేటిఎం సమాధానం ఇచ్చింది. తన తప్పు కు సంజాయిషీ తెలిపింది. పేటిఎం ఫీచర్స్ యధావిధిగా కొనసాగేందుకు అనుమతి తీసుకోని గూగుల్ ప్లే స్టోర్ లో రీస్టోర్ అయింది. అందులో సొమ్ముకు ఎలాంటి డోకా లేదు అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం పేటిఎం సేవలకు వినియోగించుకోవచ్చు అని తెలిపింది.
No comments:
Post a Comment