" ముఖ్యమంతి గారు " మీ మనసు దోచుకొనే కొందరు దొంగలు ఇచ్చే తప్పుడు సలహాలవల్లే మన ప్రభుత్యం ప్రతిష్ట దెబ్బతింటుంది. కొందరు భజన పరులు తమ స్వప్రయోజనాల కోసం మీ మెప్పు పొందేందుకు అనాలోచిత సలహాలు ఇస్తున్నారు. వారి మాటలు విని, రాజ్యాంగ, చట్టవ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం వలన న్యాయస్థానాలలో మనకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. ఈ వాస్తవాలు గమనించండి అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ కు సూచించారు. కేంద్ర ప్రభుత్యం రూపొందించిన ఏపి పునర్విభజన చట్టానికి వ్యతిరేఖంగా మూడు రాజధానులు ఏర్పాటు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్యానికి లేదు.
ప్రజలకు మీరూ చేసే వ్యతిరేఖ విధానాలు ఆపమని రాజధాని విషయంలో ఇటీవలే సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు తో మీరు మారతారు అని ఆశిస్తున్నారు ప్రజలు , మీరు చేసే ప్రజ వ్యతిరేక పనులకు కోర్టులో మీ వాదన లాయర్లకు ప్రజా ధనం చాల వృధా చేస్తున్నారు. అమరావతిలో రాజధానిని కొనసాగించాలి అని ప్రజలు, అక్కడ రైతులు కోరుతున్నారు అని, విశాఖపట్నం లో రాజధాని అవసరం లేదు అక్కడ ప్రజలు చెబుతున్నారు అని ఎంపీ తెలిపారు. చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకు అన్న బీజేపీ నేత రాంమాధవ్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో వైరస్ కట్టడికి దృష్టి పెట్టాలి అన్నారు.
విజయవాడలో ప్రభుత్వం తప్పిదం వలన కోవిడ్ క్వారంటైన్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్యానికి ఉంది ఎంపీ గారు తెలిపారు. ఆసుపత్రిని నిర్వహిస్తున్న చైర్మైన్ డాక్టర్ రమేష్ కు కులం కార్డు తగిలించి, అయన చౌదరి కాకపోయినా రమేష్ చౌదరి అని సంబోధించడం ప్రభుత్యానికి మంచి పద్ధతి కాదు.
No comments:
Post a Comment