శ్రీకృష్ణ జన్మాష్టమిని గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. గోపాలకృష్ణుని జన్మదినం సందర్భంగా భారతదేశం అంతటను ఈ ప్రతేకమైన పండగగా జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు ఎనిమిదొవ అవతారంగా శ్రీ కృష్ణా భగవంతుడుగా చెప్పుకుంటారు. దృక్ పంచాంగం ప్రకారం శ్రీకృష్ణుడి 5247వ జన్మదినాన్ని జరుపుకుంటాం. అంటే అయిదు వేల సంత్సరాల కిందట శ్రీ కృష్ణుడు జన్మించినట్లు లెక్క. ఈ పండగ రోజున ప్రతి ఇంట్లో పిల్లల్ని బాలకృష్ణుడిలా అలంకరిస్తారు.
ఈ సంవత్సరం శ్రీ కృష్ణాష్టమి ఎప్పుడు?
ప్రతి సంవత్సరం కృష్ణా జన్మాష్టమి తారీకు మారుతూ ఉంటుంది. మొదటిగా స్మార్ద సంప్రదాయం, రెండోవది వైష్ణవ సంప్రదాయం. దృక్ పంచాంగం ప్రకారం ఈ ఆగష్టు 11 వ తేదీన కృష్ణా జన్మాష్టమి జరుపుకుంటాం.
కృష్ణాష్టమి పూజ ముహూర్తం
అష్టమి తిధి : ఆగష్టు 11 న 09:06 am కి మొదలయి అష్టమి తిధి ఆగష్టు 12 వ 11:16 am కి ముగుస్తుంది.
నిషిత పూజ సమయం : 12:05 am నుండి 12:48 am వరకు . (మొత్తం43నిముషాలు)
శ్రీ కృష్ణుడి జన్మ వృత్తంతం మరియు కృష్ణాష్టమి ప్రాముఖ్యత:
మధురా రాజ్యంలో పాలించే రాజు అయినటువంటి కంసుణ్ణి చంపేందుకు శ్రీమహా విష్ణువు కృష్ణుడిగా జన్మించాడు. కంసుడికి సోదరి అయినటువంటి దేవకీ కి 8 వ సంతానంగా బాల గోపాలుడు పుట్టాడు. కంసుడి మిత్రుడు ఐనటువాంటి వసుదేవుడికి దేవకిని ఇచ్చి పెళ్లి చేసాడు కంసుడు. ఆ తర్వాత వారికి పుట్టే ఎనిమిదొవ సంతానం కంసుడిని చంపుతుంది అని ఆకాశవాణి చెప్పడంతో కంసుడికి ఆగ్రహం వస్తుంది. ఆ తర్వాత దేవకీ, వాసుదేవుని దేవుణ్ణి జైల్లో పెట్టి వారికీ పుట్టే బిడ్డలు అందరిని చంపుకుంటూ వస్తాడు. ఎనిమిదొవ సంతానంగా శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు వాసుదేవుడు ఆ గోపాలుడును బృందావనమ్ తీసుకెళ్లి నందుడు, యశోద దంపతులకు ఇస్తాడు. తిరిగి మధిర వచ్చి యశోద, నందుడికి పుట్టిన ఆడ బిడ్డను తీసుకు వచ్చి తమకు 8వ సంతానంగా ఆడ బిడ్డ పుట్టింది అని ఆమెను చంపవద్దు కోరతారు. కానీ కంసుడు ఒప్పుకోడు. ఆ ఆడపిల్లను చంపేందుకు ప్రయత్నిస్తాడు . ఆ పాప దుర్గ దేవి అవతారంలో కనిపించి నీకు చావు తప్పదు అని హెచ్చరిస్తుంది. కొన్నాళ్లు తర్వాత శ్రీకృష్ణుడు పెద్దవాడై మథురకు వచ్చి కంసుడిని చంపుతాడు దాంతో మధుర ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుంది.
శ్రీకృష్ణాష్టమి సందర్భం గా దేశ వ్యాప్తంగా దహి హుండీ కార్యక్రమాన్ని ఉట్టిలో ఉంచి అందులో తెల్లటి వెన్న, పాలు, పెరుగు కుండలో ఉంచి దానిని తాడు కట్టి దానిని ఎవరు టచ్ చేయగలరో వారిని విజేత గా ప్రకటించి ఒక బహుమతి ఇస్తారు.
మీరు ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలి అనుకుంటే ఈ క్రింద టైటిల్ ని క్లిక్ చేయండి :
No comments:
Post a Comment