కరోనా వ్యాప్తి మొదలయి నాలుగు నెలలు అవుతున్న ... ఇంకా కరోనా వైరస్ వ్యాప్తి గురుంచి పూర్తిగా తెలియని పరిస్థితి. కరోనా వైరస్ నిరోధించే వాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు వైరస్ రోజురోజుకు విజృభిస్తూ విభిన్నమైన లక్షణాలతో మరింత ప్రాణాత్మకంగా మారుతుంది. కరోనా వైరస్ ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ముందస్తు అనారోగ్యసమస్యలు ఉన్న వారిలో కరోనా వైరస్ తీవ్రత ప్రాణతంకంగ మారుతుంది. దీనిపై నిర్వహించిన ఓ కొత్త పరిశోధనను #Journal of American Medical Association లో ప్రచురించారు. ప్రాణాత్మక వైరస్ సోకినా వారిలో మరణించే అవకాశాలు ఎవరిలో ఎక్కువగా ఉంటాయో ఈ అధ్యయనం తేల్చింది.
మరణ ముప్పుకు ఎక్కువగా ఈ 6 కారణాలను ప్రధానంగా పరిశోధకులు తేల్చారు. వాటిలో ముఖ్యంగా...
-->60 ఏళ్ళు దాటినా వృద్ధులలో అనారోగ్య సమస్యలు ఉంటే, వారు వైరస్ బారిన పడితే వారు త్వరగా కోలుకోవడం ఇబ్బంది అవుతుంది.
--> ఊబకాయం వలన అధిక బరువు ఉన్నవారిలో అనారోగ్యసమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఊబకాయంతో భాదపడేవారిలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. 40 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసులో ఉన్నవారికి రోగ నిరోధక శక్తి బలహీనపడటం వలన వైరస్ తో మరణించే అవకాశం 1.5 రెట్లు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు.
--> గుండె సంబంధిత అనారోగ్యసమస్యలు ఉన్న వారిలో కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుంది అని పరిశోధకులు గుర్తించారు.
--> క్యాన్సర్ రోగుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. క్యాన్సర్ సంబంధిత సమస్యలు ఉన్న వారికీ కరోనా సోకితే మరింత ప్రాణాంతకమని పరిశోధకులు అంటున్నారు.
--> ఈ వైరస్ బారిన పడితే రోగికి సరియిన వైద్య సదుపాయం లేకపోయినా మరణించే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యసమస్య వచ్చిన భయపడకుండా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. దైర్యంగా ఉంటె కరోనాను ఇంట్లో ఉండే జయించవచ్చు. ఇప్పటి వరకు సరైన చికిత్స విధానం రాకపోయిన ఇన్ని రోజులు అనుభవంతో వైద్యులు చెప్పుతుంది ధైర్యమే దివ్యఔషదమని. కానీ కొంతమంది అతిగా స్పందిస్తున్నారు. ఆత్మహత్యల వరకు వెళుతున్నారు. వీరిలో కొంత మంది అయితే టెస్టులు చేయంచకుండనే కరోనా ఉన్నట్లు నిర్ధారణ కాక ముందే భయంతో తనువు చాలిస్తున్నారు.
మీరు ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలి అనుకుంటే ఈ క్రింద టైటిల్ ని క్లిక్ చేయండి :
No comments:
Post a Comment