మీసం తిప్పడం కాదు మాస్క్ ధరించడం వీరుడి లక్షణం అంటూ చిరు వార్నింగ్ ఇచ్చాడు I Sadam Screen - TeluguCircle-Trending News

Breaking

17 July 2020

మీసం తిప్పడం కాదు మాస్క్ ధరించడం వీరుడి లక్షణం అంటూ చిరు వార్నింగ్ ఇచ్చాడు I Sadam Screen



       కోవిడ్-19 వల్లనా లాక్ డౌన్  లో ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ మీడియా లో బాగా బిజీగా ఉంటున్నారు. ఒక టాప్ హీరో గా తన వంతు భాద్యత గా కరోనా వైరస్ మీద సందేసాత్మక రెండు వీడియోలను యువ నటులు ఇషా రెబ్బా, హీరో కార్తికేయ తో కలిసి రూపొందించారు. 

    " మాస్క్ ధరించండి కరోనా వ్యాప్తిని తగ్గే వరకు దూరాన్ని పాటించండి " అంటూ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు సీనియర్ హీరో చిరంజీవి. ఈ సందేశాన్ని వీడియో ద్వారా ట్వీటర్ లో అభిమానులతో పంచుకున్నారు. ఒక వీడియోలో కార్తికేయ అద్దం ముందు నిలబడి మీసం తిప్పుతూ ఉండగా .. చిరు మాస్క్ తో స్టైల్ గా ఎంట్రీ ఇచ్చారు. ' మీసం తిప్పడం వీరత్వం కానీ అది ఒకప్పుడు. ఎప్పుడు మొహానికి మాస్క్ వేసుకోవడం వీరుడి లక్షణం' అంటూ కార్తికేయకు హిత బోధ చేసి అతనితో మాస్క్ తొడిగిస్తాడు. 

                                            మరో వీడియోలో ఇషా రెబ్బా ఫేసుకి మేకప్ వేసుకుంటుండంగా … చిరునవ్వు మొహానికి అందం. కానీ, ఎప్పుడు ఉన్న పరిస్థితులలో ఆ చిరునవ్వు కలకాలం ఉండాలంటే .. మొహానికి మాస్క్ వేసుకోవడం ఎంతో అవసరం అంటూ ఇషా తోనూ మాస్క్ ధరించేలా చేసాడు. ప్రస్తుత ఈ రెండు వీడియోలు నెట్లో అందరిని ఆకట్టుకుంటున్నాయి. 




No comments: