ప్రమాద స్థాయిలో కరోనా కేసులు ....ఒక్క రోజులో ఇన్ని కేసులా. ఆంధ్ర ప్రదేశ్ లో రోజు రోజుకు కరోనా విజృంబాణ పెరుగుపోతుంది. కొత్తగా ఆంధ్రా లో 3963కేసులు నమోదయ్యాయి. ఆంధ్రాలో ఒకేరోజు ఇన్ని ఎక్కువ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. వీటితో ఆంధ్రాలో ఇప్పటి వరకు నమోదయిన కేసులు సంఖ్య 44,609కి చేరింది.
గడిచిన 24గంటలలో కొరోనా వైరస్ సోకి 52 మంది మృతి చెందగా … ఇప్పటి వరకు 589 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. తూర్పు గోదావరిలో 12 మంది, గుంటూరు , కృష్ణ జిల్లాలో 8 మందికి, అనంతపురంలో 7 గురు, పశ్చిమ గోదావరిలో 5గురు, ప్రకాశంలో 3గురు, విశాఖలో 2, కడప, చిత్తూరు , విజయనగరం ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు, వివిధ ఆసుపత్రిలలో, క్యారంటైన్ కేంద్రాలలో 22,260 మంది చికిత్స పొందుతున్నారు. 21, 763 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుతం బులిటెన్ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12.84లక్షల మందికి కరోనా వైరస్ పరీక్షలు చేసినట్లు తెలిపారు.
ఇదే విధంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతే పరిస్థితిని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. ప్రభుత్యాలు చేసుకుంటాయి అని విచ్చలవిడిగా లిక్కర్ షాపులు వద్ద, బహిరంగ ప్రదేశాలలో సామజిక దూరం పాటించకుంటే తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎవరి ఇంట్లో వారు ఉన్నాసరే కరోనా బారిన పడే అవకాశం ఉంటుంది. ఎంతో అవసరం ఉంటె తప్ప ప్రతిఒక్కరు మాస్క్ లు ధరించి, చేతులకు శానిటైజెర్లు రాసుకొని సామజిక దూరం పాటించండి.
#StayHome #StaySafe
జిల్లాలు వారీగా నమోదయిన కరోనా వైరస్ కేసుల వివరాలు
No comments:
Post a Comment