షాకింగ్ అమితాబ్ బచ్చన్ కి, అభిషేక్ బచ్చన్ కి కరోనా పాజిటివ్ II TeluguCircle - TeluguCircle-Trending News

Breaking

12 July 2020

షాకింగ్ అమితాబ్ బచ్చన్ కి, అభిషేక్ బచ్చన్ కి కరోనా పాజిటివ్ II TeluguCircle




               బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి  కొరోనా వైరస్ సోకింది.బిగ్ బి ని ముంబై లోని నానావతి హాస్పిటల్ లో శనివారం రాత్రి చికిత్స కోసం చేరారు.  ఈ సమాచారాన్ని అమితాబ్ బచ్చనే స్వయంగా ఆయన  ట్వీటర్ ద్వారా తెలియచేసారు. బిగ్ బి కి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది అని, హాస్పిటల్ కి వెళ్ళమని, కుటుంబ సభ్యులు, సిబ్బంది కూడా కొరోనా టెస్టులు చేయించు  కున్నారు, రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. 

                గత 10 రోజుల నుండి నన్ను కలసిన వారంతా కోవిడ్-19 పరీక్షలు చేయించు  కోవాలి అని బిగ్ బి సూచించారు. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వయసు 77 సంవత్సరాలు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అవ్వడంతో బిగ్ బి అభిమానుల్లో ఆందోళన పడుతున్నారు. 

                ఎన్నో తగు జాగ్రత్తలు తీసుకొనే బిగ్ బి లాంటి సెలెబ్రిటీ కరోనా సోకింది అంటే సామాన్య ప్రజలు చాల జాగ్రత్తలు తీసుకోవాలి . ఎందుకంటే ధనికులు   ఇంట్లో కూర్చున్ననష్టమేమీలేదు .కానీ సామాన్యుడు రోజువారీ ఉపాధి కోసం చాల మంది జనాలను కలవాల్సి ఉంటుంది. పనులు కోసం బయటకి వెళ్ళినప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి … ఎందుకంటే కొంత మంది మూర్ఖులు మాకు కరోనా లేదు కదా అని విచ్చలవిడిగా వైన్ షాపులకి , రోడ్ల మీద అడ్డాగోలుగా తిరుగుతారు. 

No comments: