ఉచితంగా 5 వేల రూపాయలు వరకు స్క్రాచ్ కార్డులంటూ భారీ మోసం. #GooglePay పేరుతో వైరల్ అవుతున్న మెసేజ్ లు లింక్ లు ఓపెన్ చేయవద్దు , అప్రమత్తంగా ఉండాలన్నా సైబర్ క్రైమ్ పోలీసులు.
అసలు వివరాలలోకి వెళ్తే, మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన #KYC వివరాలను అప్ లోడ్ చేయండి అని , #GooglePay వినియోగదారులు లింక్ ఓపెన్ చేస్తే రూ. 500 నుండి 5000 వరకు స్క్రాచ్ కార్డ్స్ పొందవచ్చు అని, ఇలా అనేక రకాల లింకులు ఫోన్ కు మెసేజ్ ,వాట్సాప్ రూపంలో వస్తున్నాయి . ఇలాంటి లింకులతో జాగ్రత్తగా ఉండాలి అని సైబర్ క్రైమ్ పోలీసులు
హెచ్చరిస్తున్నారు. ఇవి అన్ని సైబర్ నేరగాళ్ల తయారుచేసిన మోసపూరితమైన లింకులు ఓపెన్ చేసి మీ వివరాలు నమోదు చేస్తే బ్యాంకు ఖాతా లోని సొమ్ము కాజేస్తున్నారు అని పేర్కొన్నారు.
ఈ లింక్ ఓపెన్ చేసి 5 లక్షలు పోగొట్టుకున్నా డాక్టర్ :
సైబరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక డాక్టరు ఆక్టోబర్ 21 వ తారీఖున మెసేజ్ వచ్చింది , ఆ లింక్ ఓపెన్ చేస్తే #RBI రూల్స్ ప్రకారం మీరు వెంటనే మీ #KYC మరియు మీ బ్యాంకు అకౌంట్ వివరాలు అప్ లోడ్ చేయాలి లేకపోతే నిలిపివేస్తాం అని మెసేజ్ తోపాటు #GooglePay లింక్ పంపారు ఆ డాక్టర్ తెలియకుండా గూగుల్ లింక్ ఓపెన్ చేసాడు. అందులో వివరాలను నింపాడు. ఆ వివరాలు అన్ని సైబర్ నేరగాళ్లకు వెళ్లాయి. నిమిషాలలో డాక్టర్ అకౌంట్ లో ఉన్న 5 లక్షల రూపాయలు కొట్టేసారు.
వైరల్ అవుతున్న #GooglePay లింక్ :
ప్రస్తుతం ఈ లింక్ పలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది . గూగుల్ పే వినియోగదారులు 500నుండి 5000 వరకు ఉచితంగా #ScratchCard లు పొందవచ్చు అని మెసేజ్ తో పాటు గూగుల్ లింక్ కూడా వివిధ గ్రూపులలో వందలమంది ఆ మెసేజ్ ను స్నేహితులకు షేర్ చేస్తున్నారు . ఫోన్ కు వస్తున్న ఆ మెసేజ్ ,వాట్సాప్ రూపంలో వస్తున్న గూగుల్ పే లను తొందరపడి ఓపెన్ చేయవద్దు. లింక్ ఓపెన్ చేస్తే మీ ఫోన్ లో ఉన్న డేటా ఆ నేరగాళ్ల చేతికి వెళ్లే అవకాశం ఉంది .
No comments:
Post a Comment